Pages

Saturday, November 15, 2014

How to stop drinking through government telugu

మందు(మద్యపానం) బానిసలకు విముక్తి! ప్రభుత్వం ద్వారా ....
ప్రభుత్వం అని ఎందుకు అన్నానంటే.. ప్రభుత్వం ప్రజలకు తల్లి తండ్రి లాంటిది. చిన్నతనంలో పిల్లలు మట్టి తింటారు. తల్లి చెబుతుంది, తిడుతుంది, కొడుతుంది కూడా, కానీ మానరు. చివరకు బిడ్డలకు అందకుండా చేస్తుంది. మనిషికి తన ఆరోగ్యం మీద నిర్లక్ష్యం ఎక్కువ. "మద్యపానం ఆరోగ్యానికి హానికరం" అని మందు సీసా మీద ఉంటుంది. ఈ విషయం ప్రతీ వ్యక్తికీ తెలుసు. కానీ తాగుతారు. ఎందుకు? మందు ముందుగా సరదా కోసం మొదలుపెడతారు. రోజుకో పార్టీ చేసుకుంటారు. చివరకు భానిసగా మారతారు. ఇలాగ మారిన వారు మందు ఎప్పుడు తాగుతారు అంటే.. సంతోషంగా వున్నా, భాదగా వున్నా, ఏపనీ లేక బోర్ కొట్టినా తాగుతారు. తాగడానికి కావలసినది ఒక వంక.
కుర్రవాళ్ళు ముందుగా మందు ప్రారంబించేది బీర్ తోనే.. ఎలాగనగా డిసెంబర్ 31 చాలమంది కుర్రవాళ్ళు మందు మొదలుపెట్టే రోజు. ఈ రోజునాడే మందుకు ఏరోజూ ఆఫర్ పెట్టని బార్ షాప్ లు ఈ ప్రత్యేకమయిన రోజునే ఆఫర్స్ ఇస్తారు. ఎందుకో? తాగుడు మొదలు పెట్టి జీవితంలో నాశనమవమని.  కనుక ముందుగా బీర్, వాట్కా లను రద్దు చేయాలి.
ఇధి భానిసగా మారినవారికి మాత్రమే. ప్రతీ మనిషికి కోరిక ఎక్కువగా వుంటుంధి, కావలసిన వస్తువు ఎదైనా అది దొరుకుతున్నంత వరకు మనసు అదుపులో ఉండదు. దొరకకుండా చేస్తేనే మనసు అదుపులోకి వస్తుంది.  ప్రవేటు భార్ షాపులు, బెల్టు షాపులు రద్దు చేయాలి. ప్రభుత్వం  మాత్రమే రేషన్ షాపులాగ  ప్రభుత్వ మంధు దుఖానం ప్రారంభించాలి. 30 సంవత్సరాలు ధాటిన వారికి మాత్రమే అమ్మాలి. అధి కూడా చాలా లిమిట్ గా ఇవ్వాలి. ప్రతీ సంవత్సరం వయస్సు  పరిమితి పెంచుకుంటూ వెళ్ళాలి. మంధుకు భాగా భానిస అయిన వాళ్ళు అధుపులోకి వస్తారు.  కొత్త తాగుబోతులు తయారు అవరు. పార్టీలు తగ్గుతాయి. తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు వుండరు. ప్రమాదాలు తగ్గుతాయి. 90% గ్యారంటీ..


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.